మాజీ ముఖ్యమంత్రి క‌న్నుమూత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 12:38 PM IST
మాజీ ముఖ్యమంత్రి క‌న్నుమూత‌

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ గురువారం కన్నుమూశారు. ఆయ‌న 92 సంవ‌త్స‌రాలు. అనారోగ్య కార‌ణాల‌తో అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇదిలావుంటే.. కేశుభాయ్ పటేల్ 1995లో మార్చి నుంచి అక్టోబరు వరకు మొద‌టి ప‌ర్యాయం గుజరాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆ త‌ర్వాత‌ 1998 నుండి 2001 వరకు రెండ‌వ‌సారి సీఎంగా పనిచేశారు.

కేశుభాయ్ పటేల్ ఆరుసార్లు శాసనసభకు ఎన్నిక‌య్యారు. 2012లో బిజెపిని వీడిన ఆయ‌న‌ సొంతగా 'గుజరాత్ పరివర్తన్ పార్టీ'ని స్థాపించారు. అయితే.. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో విసావదర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి శాస‌న స‌భ్యుడిగా ఎన్నికయిన ఆయ‌న‌.. తరువాత అనారోగ్య కారణాల‌తో 2014లో రాజీనామా చేశారు. కాగ‌.. గ‌త నెల‌లో ఆయ‌న‌ కొవిడ్ బారిన ప‌డ్డారు.

Next Story