Fact Check : ఒకటే స్కీమ్ ను కేజ్రీవాల్ మూడు సార్లు ప్రవేశ పెట్టారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 10:35 AM GMT
Fact Check : ఒకటే స్కీమ్ ను కేజ్రీవాల్ మూడు సార్లు ప్రవేశ పెట్టారా..?

జులై 21వ తేదీన ఢిల్లీ ప్రభుత్వం 'ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన' కింద ప్రతి ఇంటికీ రేషన్ సరుకులను అందించే పనిని మొదలుపెట్టింది. ఈ స్కీమ్ మీద సామాజిక మాధ్యమాల్లో పలువురు అభినందనలు తెలుపుతూ ఉంటే.. మరికొందరేమో 'ఒకే స్కీమ్ ను మూడు సార్లు ఎలా ప్రవేశపెట్టాలో తెలుసుకోవాలంటే కేజ్రీవాల్ ను సంప్రదించండి' అని పోస్టులు పెడుతున్నారు. కొన్ని న్యూస్ పేపర్స్ కు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను కూడా షేర్ చేసి.. ఒకటే స్కీమ్ ను కేజ్రీవాల్ మూడు సార్లు ప్రవేశపెట్టారని చెబుతూ ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఇదే స్కీమ్ ను ప్రవేశపెట్టారని పోస్టులు పెడుతున్నారు.

K1

అందులో ఉన్న పేపర్ కటింగ్స్ లో జులై 6, 2018 న 'హిందుస్థాన్ టైమ్స్' లో ఉన్నట్లుగా కథనం ఉంది. మరో ఫోటోలో 'బిజినెస్ స్టాండర్డ్' జనవరి 8, 2020 న.. మూడో దాన్లో 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో జులై 21, 2020న వచ్చిన కథనం ఉంది. మూడు సార్లు ఒకటే పథకం గురించి చెప్పారని అందులో పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

ఒకటే స్కీమ్ ను కేజ్రీవాల్ మూడు సార్లు ప్రవేశ పెట్టారన్నది 'అబద్ధం'

న్యూస్ మీటర్ ఈ కథనాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించగా అందులో ఒక్కో సమయంలో.. ఒక్కో స్థాయిలో ఈ పథకానికి సంబంధించిన సమాచారం మీడియా సంస్థల్లో వచ్చింది.

జులై 6, 2018 సమయంలోనే ఈ డోర్ స్టెప్ డెలివరీని అమలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. “Approved Doorstep Delivery of Rations. Overruled all objections to the proposal. Directed Food Dept to start its implementation immediately.” అంటూ అప్పట్లోనే ట్వీట్ కూడా చేశారు.



అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ 2018లో ఈ పథకాన్ని అమలుచేయలేదు. ఫుడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుమతులు రాకపోవడమే.

జనవరి 8, 2020న Business Standard లో ఈ స్కీమ్ కు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది. అందులో ఈ పథకాన్ని అమలు చేసే రోజు ఎప్పుడా అన్నది వెల్లడించలేదు. అందులో వచ్చినది జులై 6, 2018 వార్తనే..! కేవలం ఇంకా ఎప్పుడు అమలు చేస్తారో తెలీదు అంటూ అప్డేట్ మాత్రమే ఇచ్చారు. జనవరి 8, 2020న కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ పథకం గురించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.

జులై 21, 2020న ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో 'డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్' మీద కథనాన్ని ప్రచురించింది. క్యాబినెట్ ఆమోదం లభించింది అంటూ కథనాలను వెల్లడించింది. క్యాబినెట్ ఆమోదం లభించగానే ఈ పథకాన్ని అమలు చేయడానికి 6-7 నెలలు పడుతుందని.. ఓ మంచి నిర్ణయం అని కేజ్రీవాల్ తెలిపారు.

కేజ్రీవాల్ 'డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్' ను ప్రవేశపెట్టాలని 2018లోనే అనుకున్నారు. అది కేంద్రం ఆమోదం పొంది.. పథకం అమలవ్వడానికి సమయం తీసుకుంది. ఆ సమయంలో వివిధ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అంతేకానీ ఒకటే పథకాన్నే మూడు సార్లు అమలు చేశారాన్నదాన్లో 'నిజం లేదు'.

Next Story