అసెంబ్లీలో కేసీఆర్‌ చమక్కులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 9:16 AM GMT
అసెంబ్లీలో కేసీఆర్‌ చమక్కులు..!

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో చమక్కులు వేశారు. కాంగ్రెస్ - బీజేపీలపై చమక్కుల బాణాలు వదిలారు. "ఏం లేనోనికి ఏతులెక్కువనే" తెలంగాణ సామెతను అసెంబ్లీలో గుర్తు చేశారు సీఎం కేసీఆర్‌. ఈ సామెతలాగానే ఉంది ఓ పార్టీ తీరంటూ ఎద్దేవా చేశారు. "అస్తిమి..అగొ అస్తిమి..ఎల్లుండి అస్తిమి..అవలెల్లుండి అస్తిమి"అని అంటూ ప్రత్యర్ధి పార్టీలపై తెలంగాణ వ్యాస, భాషలో విమర్శల వాన కురిపించారు. తమ దగ్గర రెండు, మూడు కొత్త పథకాలు ఉన్నాయని..వాటిని బయటకు తీస్తే ప్రత్యర్ధి పార్టీలు ఉండవన్నారు.

Image result for cm kcr in assembly

భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన రెవిన్యూ చట్టం తెస్తామన్నారు. అవసరమైతే వీఆర్వో వ్యవస్థ తీసేస్తామన్నారు. పోవాల్సిన నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలు పోలేదా? ఇప్పుడు వీళ్లు వాళ్లకంటే ఎక్కువ తయారైతే తీసేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వమన్నారు. అది తమ విధానమని తేల్చి చెప్పేశారు కేసీఆర్‌. చాలా మంది రైతులతో మాట్లాడిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కౌలు రైతులు భూ యజమానుల కాదు..పంట పెట్టుబడి గురించి భూ యజమాని, కౌలు రైతులే అవగాహన కుదుర్చుకోవాలన్నారు సీఎం కేసీఆర్‌.

Next Story