హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. కేటీఆర్‌కు క‌విత విషెస్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 1:30 PM GMT
హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. కేటీఆర్‌కు క‌విత విషెస్‌

తెలంగాణ ఐటీ శాఖ‌ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయ‌న‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్య‌క‌ర్త‌లు, బ‌డా నేత‌ల‌తో పాటు మంత్రు‌లే కాకుండా అన్ని రంగాల ప్ర‌ముఖులు.. ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా కేటీఆర్‌కు బర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు.అయితే, కేటీఆర్ సోద‌రి.. మాజీ ఎంపీ కవిత తన సోదరుడికి ట్విట‌ర్ వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మనం తోబుట్టువులను, ఇరుగుపొరుగును ముందే ఎంచుకోలేమ‌ని అంటుంటారు. కానీ నేను.. నీ చిట్టి చెల్లెల్ని అయినందుకు నువ్వెంత అదృష్టవంతుడివో నమ్మలేకపోతున్నా.. నీ లాంటి రాక్ స్టార్ అన్న‌య్య‌ను క‌లిగి ఉండటం నిజంగా చాలా గొప్పగా ఉంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్యా అంటూ కవిత ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు చిన్నతనంలో కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌‌ చేశారు. ఇదిలావుంటే.. కవిత కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆమె కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

Next Story