టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విషెస్‌ తెలుపుతున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టొద్దని ప్రతిసారి అభిమానులు, కార్యకర్తలకు సూచిస్తారు కేటీఆర్. ఆ డబ్బులను మంచి పనుల కోసం, ఆపదలో ఉన్న వారి కోసం ఖర్చు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

‘హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’ – ఏపీ సీఎం జగన్‌

“హ్యాపీ బర్త్ డే డియర్ తారక్… ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో మీరు చూపించే చొరవకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మున్ముందు మరింతమందికి మీ సహాయ సహకారాలు అందేలా మరింత శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” – మెగాస్టార్‌ చిరంజీవి

పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలి – మంత్రి హరీష్‌ రావు

‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్‌. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ – రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్‌

మా ప్రియమైన సోదరుడు కేటీఆర్‌ కి నా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆరోగ్యం, శ్రేయస్సును అందిచాలని చిలుకూరు బాలాజీని ప్రార్థస్తున్నానని ట్వీట్‌ చేశారు. – పవన్ కల్యాణ్

కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, మహేష్‌బాబు, రచయిత కోనవెంకట్‌, ప్రకాశ్‌రాజ్‌, అనసూయ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మంచులక్షీ తదితరులు ఉన్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort