డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వమే చంపేసింది -కరీంనగర్ ఎంపీ బండి సంజయ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2019 8:33 PM ISTహైదరాబాద్: రాజ్యాంగ బద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులపై సీఎం కేసీఆర్ చట్టవ్యతిరేకమైన చర్యల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు ఎంపీ బండి సంజయ్. డ్రైవర్ శ్రీనివాస రెడ్డిని ప్రభుత్వమే హత్య చేసిందన్నారు. ఉద్యమ ద్రోహులను కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఉద్యమకారుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. న్యాయపరంగా సమ్మె చేస్తున్న కార్మికులపై ఉద్యమ ద్రోహులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ఎంపీ సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర సాధనలో తొలి అమరుడిగా శ్రీకాంత చారి నిలిస్తే.. ప్రత్యేక రాష్ట్రంలో శ్రీనివాస రెడ్డి నిలిచాడని చెప్పారు సంజయ్. హరీష్ రావుకు నాడు కిరోసిన్ దొరికింది కానీ అగ్గిపుల్ల దొరకలే.. కానీ శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతుడయ్యాడన్నాడు. సెలబ్రిటీలు చనిపోతే పరుగున వెళ్లే సీఎం కేసీఆర్ ..కార్మికుడు చనిపోతే కనీసం ప్రకటన చేసే టైమ్ లేదా అని ఎంపీ సంజయ్ ప్రశ్నించారు.