చాలా రోజుల తర్వాత కనిపించిన కరణ్ జోహార్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 July 2020 3:11 PM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి ఓ విధంగా కరణ్ జోహార్ కారణమని పలువురు ఆరోపించారు. సుశాంత్ కు వచ్చిన సినిమా ఆఫర్లను తన కాంపౌండ్ కు చెందిన హీరోలకు ఇప్పించాడని ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తనపై వచ్చిన ఆరోపణల అనంతరం కరణ్ జోహార్ సోషల్ మీడియాకు బాగా దూరమయ్యాడు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్లోడ్ చేయలేదు. ట్విట్టర్ లో పలువురిని అన్ ఫాలో చేశాడు.తన మీద వచ్చిన ఆరోపణలపై కరణ్ జోహార్ కనీసం స్పందించనూ లేదు.
ఎక్కడా కనిపించకుండా పోయిన కరణ్ జోహార్ బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ నీతూ కపూర్ పుట్టినరోజు వేడుకలో కనిపించాడు. నీతూ కపూర్ తన 62వ పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యులతోనూ, క్లోజ్ ఫ్రెండ్స్ తోనూ కలిసి జరుపుకుంది. ఈ పుట్టినరోజు వేడుకకు కరణ్ జోహార్ కూడా హాజరయ్యాడు. నీతూ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలో కరణ్ తో పాటూ రిద్ధిమా కపూర్ షైనీ, రణబీర్ కపూర్, రీమా జైన్, అర్మాన్ జైన్ తదితరులు ఉన్నారు. రిద్ధిమా కపూర్ షైనీ ఇంట్లో డిన్నర్ ను ఏర్పాటు చేశారు. రిషి కపూర్ చనిపోయాక వారి కుటుంబం లో చోటుచేసుకున్న చిన్న పాటి సెలెబ్రేషన్ ఇదని చెబుతూ ఉన్నారు.