థ్రిల్లర్‌గా సుమంత్ 'కపటధారి'.. ఫస్ట్‌లుక్ విడుదల
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 8:32 PM ISTఇటీవల విభిన్న చిత్రాలు ఎంచుకుంటూ వరుస హిట్లు అందుకుంటున్నాడు హీరో సుమంత్. మళ్ళీరావా, సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ చిత్రాలతో అందరిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న నటిస్తున్న కపటదారి. క్రియేటివ్ ఎంటర్‌టైనర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అధినేత జి.ధనంజయన్ సమర్పణలో లలితా ధనంజయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు.
సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఎంటైర్ యూనిట్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు చైతన్య. ఫస్ట్‌లుక్ చూస్తే సుమంత్ లుక్ చాలా ఇన్‌టెన్స్‌గా కనిపిస్తుంది. ఆర్టికల్ 352 అని కూడా పోస్టర్‌లో కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ అని రాసి ఉంది. ఇక సుమంత్ ఓ చేతితో క్రిమినల్‌పై గన్ ఎక్కుపెట్టి, మరో చేతితో మైక్రో స్పీకర్‌లో మాట్లాడుతున్నట్లుగా ఉంది. సుమంత్ లుక్ సీరియస్‌గా ఉంది. మొత్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.