డ్రగ్స్ దందా : నాని హీరోయిన్ ను అదుపులోకి తీసుకుని.. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలింపు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2020 8:20 AM GMT
డ్రగ్స్ దందా : నాని హీరోయిన్ ను అదుపులోకి తీసుకుని.. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలింపు

రాగిణి ద్వివేది.. పలు కన్నడ సినిమాలతో పాటూ దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. నేచురల్ స్టార్ నానితో కలిసి 'జెండాపై కపిరాజు' సినిమా ద్వారా తెలుగు ప్రజలను పలకరించింది. ప్రస్తుతం కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందిన వారికి డ్రగ్స్ దందాతో పరిచయం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిపై దృష్టి సారించారు.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) ప్రస్తుతం ఈ డ్రగ్స్ దందాపై విచారణ చేస్తోంది. దీంతో శుక్రవారం నాడు హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు నిర్వహించారు. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన అధికారులు హీరోయిన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఉదయం 6 గంటల సమయంలో రాగిణి ద్వివేది ఇంటికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు సిటీలోని యలహంక సమీపంలోని జ్యూడీషియల్ లేఔట్ లోని అనన్యా అపార్ట్ మెంట్స్ లో ఫేమస్ నటి రాగిణి ద్వివేది నివాసం ఉంటున్నారు. నటి రాగిణి ద్వివేది ఉపయోగిస్తున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మొబైల్స్ లోని కాల్ డేటాను సీసీబీ పోలీసులు పరిశీలిస్తున్నారు.

రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ రవిశంకర్ ను అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు అతను ఇచ్చిన సమాచారం మేరకు రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేస్తున్నారు. గురువారం విచారణకు హాజరు అవ్వలేదు. బెంగళూరు పోలీసులు జారీ చేసిన సమన్లపై నటి రాగిణి ద్వివేది సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులు నాకు అందాయి. కొన్ని కారణాల వల్ల సీసీడీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. చట్టాలపై నాకు గౌరవం ఉంది. సోమవారం వరకు నా తరఫున లాయర్లు విచారణకు హాజరవుతారు. ఈ కేసులో నేను సోమవారం పోలీసుల ముందు హాజరవుతాను అని రాగిణి స్పష్టం చేశారు. ఇంతలో ఉదయానే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు.

తమ సోదాల అనంతరం రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకొన్నారు. ఆమెను క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆగస్టు 21న బెంగళూరు శివారులోని రాయల్ సూట్స్ హోటల్‌లో NCB అధికారులు సోదాలు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 145 MDMA పిల్స్‌, రూ.2.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురి అరెస్ట్‌ చేసి విచారించగా మరికొందరి లింకులు బయటపడ్డాయి.

Next Story