బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగు పడింది: ఎంజీఎం వైద్యులు

By సుభాష్  Published on  1 Sep 2020 5:53 AM GMT
బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగు పడింది: ఎంజీఎం వైద్యులు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడిందని చెన్నై ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న బాలు.. వైద్యంతో పాటు ఫిజియోథెరఫికి కూడా స్పందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మా వైద్య బృందం బాలు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. బాలు పూర్తిగా స్కృహలోనే ఉన్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు వివరించారు.

కాగా, కరోనాతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలుకు మొదట స్వల్ప కరోనా లక్షణాలు కనిపించగా, తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్‌పైనే ఉంచి ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఎక్మోతోపాటు ఫిజియోథెరఫీ చికిత్స అందిస్తున్నారు. బాలు క్షేమంగా కోలుకుని బయటకు రావాలని సినీ లోకంతోపాటు అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Next Story