దేశంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

By సుభాష్  Published on  1 Sep 2020 4:34 AM GMT
దేశంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

దేశ వ్యాప్తంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య, దక్షిణాధి రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పంజాబ్‌, బీహార్‌, బెంగాల్‌ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా అప్రమత్తం కావాలని సూచించింది. అలాగే దక్షిణాధి రాష్ట్రాల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ సహా ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కాగా, ఆగస్టులో దేశంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. సాధారణం కన్నా 27 శాతం అధిక వర్షం పాతం నమోదైనట్లు తెలిపింది. ఆగస్టు నెలలో కురిసిన వర్షాపాతం గత 120 ఏళ్లలో నాలుగో రికార్డు అని వెల్లడించింది. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి వాగులు వంకలు నిండిపోయాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు రావడంతో ప్రాజెక్టు గేట్లను వదిలి దిగువన వదిలుతున్నారు. రిజర్వాయర్లన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఇళ్లన్నీ కూలిపోయి నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంకొందరు మృత్యువాత పడ్డారు. రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోలకలకు తీవ్ర అంతరాజయం ఏర్పడింది.

Next Story