బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోయారు. ఆమెను రాయ‌దుర్గం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించి కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.