అనుమానాస్పద స్థితిలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి
By తోట వంశీ కుమార్ Published on : 28 May 2020 7:40 PM IST

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆమెను రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story