మ్యాన్ హోల్‌కు కంగనా పేరు.. ఆ ఫోటోను ముంబై పోలీసు కమీషనర్ లైక్ చేశారంటూ దుమారం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Sep 2020 7:25 AM GMT
మ్యాన్ హోల్‌కు కంగనా పేరు.. ఆ ఫోటోను ముంబై పోలీసు కమీషనర్ లైక్ చేశారంటూ దుమారం..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున స్పందిస్తూ వస్తున్నారు. బాలీవుడ్ లో డ్రగ్స్ దందా గురించి కూడా ఆమె తన వాదనను వినిపిస్తున్నారు. ముఖ్యంగా ముంబై పోలీసుల తీరుపై ఆమె ఎప్పటి నుండో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

తాజాగా కంగనా రనౌత్ పేరును ఓ మ్యాన్ హోల్ కు పెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను ముంబై పోలీసు కమీషనర్ పరమ్ బీర్ సింగ్ లైక్ చేసినట్లుగా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను చంపినవాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే.. వారి మీద అమర్యాదకరంగా వచ్చే పోస్టులను పోలీసు కమీషనర్ లైక్ చేయడం ఏమిటి అని కంగనా ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరికి వ్యతిరేకంగా పెట్టే పోస్టులను ఖండించాల్సింది పోయి.. వారికి మద్దతును ఇస్తూ లైక్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.



ముంబైలో తాను ఉండడం శ్రేయస్కరమేనా అంటూ మరో ట్వీట్ లో ఆమె తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ముంబై పోలీసు కమీషనరే తన మీద వచ్చిన అమర్యాదకరమైన పోస్టులను లైక్ చేస్తూ ఉంటుంటే ముంబైలో నేను ఉండడం శ్రేయస్కరమేనా.. నా సేఫ్టీకి ఎవరు బాధ్యులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీని తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు.

మ్యాన్ హోల్ కు కంగనా పేరు పెట్టిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పలువురు నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నారు.

కంగనా ట్వీట్ పై ముంబై పోలీసులు స్పందించారు. ముంబై పోలీసు కమీషనర్ సదరు పోస్టును లైక్ చేయలేదని.. సైబర్ పోలీసు స్టేషన్ ఆ స్క్రీన్ షాట్ పై విచారణ చేస్తోందని తెలిపారు.

అంతకు ముందు మరో ట్వీట్ లో కంగనా రనౌత్ కరణ్ జోహార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ మాఫియాకు సంబంధించి అసలు నేరస్తుడు కరణ్ జోహారేనని అంటూ మండిపడ్డారు. అనేకమంది జీవితాలను, కెరీర్లను నాశనం చేసిన తర్వాత కూడా అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు కంగనా. అతడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకునేది జరిగే పనేనా? . ఈ వ్యవహారం అంతా సద్దుమణిగాక కరణ్, క్రూరమృగాల వంటి అతని గ్యాంగ్ సభ్యుల తనను టార్గెట్ చేస్తారంటూ ట్వీట్‌ చేశారు.

Next Story