‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్’‌ వెబ్‌సిరీస్‌కు బ్రేక్‌ పడింది. ఈ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేయరాదంటూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కావాల్సిన బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్‌ కు బ్రేక్‌ పడింది. సత్యం కుంభకోణం నేపథ్యంలో తన జీవిత చరిత్రను చిత్రీకరించారన్న అనుమానాలున్నాయని.. సత్యం కంప్యూటర్స్‌ మాజీ చైర్మన్‌ బి.రామలింగరాజు కోర్టును ఆశ్రయించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీనిపై సిటీ సివిల్‌ కోర్టు విచారణ జరిగింది.

పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిందని.. దీనిపై ఆయన అప్పీలు దాఖలు చేశారన్నారన్నారు. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉండగా.. వెబ్‌సిరీస్‌ విడుదల చేయడం సరికాదన్నారు. దీనిపై వాదనలు విన్న విన్న సివిల్‌ కోర్టు.. సిరీస్‌ ప్రదర్శనను నిలిపివేయాలని ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌కు విడుదల ఆగిపోయింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *