ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్‌కల్యాణ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ నిమా ఫస్ట్‌ లుక్‌ అలరిస్తుండగా, తాజా మోషన్‌ పోస్టర్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. సాఫ్ట్‌ బాల్‌ స్టిక్‌ పట్టుకుని పవన్‌ నిలబడిన పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. హిందీలో సక్సెస్‌ సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం వేసవిలో ఈ సినిమాను విడుదల కావాల్సి ఉంది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వకీల్‌సాబ్‌’ పరిస్థితులు అనుకూలించిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్‌లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా, కరోనా అడ్డుపడింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *