ఓటీటీలను పోర్న్‌ సైట్స్‌తో పోల్చిన కంగనా రనౌత్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2020 11:43 AM GMT
ఓటీటీలను పోర్న్‌ సైట్స్‌తో పోల్చిన కంగనా రనౌత్

బాలీవుడ్ వివాదాస్పద నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్స్‌ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులతో థియేటర్స్, మల్టీప్లెక్స్‌లు మూతపడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అన్‌లాక్ చర్యల్లో భాగంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

అయితే, కోవిడ్ నిబంధనలు త‌ప్ప‌కుండా పాటించాల‌ని ఆంక్షలు విధించింది. దీంతో చాలామంది నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలో విడుదల చేస్తున్నారు. ఈ విష‌య‌మై కంగనా రనౌత్ స్పందించారు.ఆమె ఓటీటీలను పోర్న్ వెబ్‌సైట్లతో పోల్చుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. లైంగిక కంటెంట్‌తో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టమని పేర్కొంది. అలాగే.. సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులను మనం కాపాడుకోవాలి. లైంగిక కంటెంట్‌తో ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టమని పేర్కొంది.

ఓటీటీ ఫ్లాట్ ఫాం అనేది నీలి చిత్రాలకు అడ్డాగా మారిందని ఆమె కామెంట్ చేశారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోస్ విడుదల చేసిన ఫోటోలు, పోస్టులపై ఆమె విరుచుకుపడింది. ఈరోస్ చేసిన పనికి సిగ్గుపడుతున్నానని కంగనా అన్నారు.

Next Story