ఆకట్టుకుంటున్న కనకదుర్గ ప్లై ఓవర్‌ డ్రోన్‌ వ్యూ.. వీడియో వైరల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 12:45 PM GMT
ఆకట్టుకుంటున్న కనకదుర్గ ప్లై ఓవర్‌ డ్రోన్‌ వ్యూ.. వీడియో వైరల్

విజయవాడ నగర వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదరుచూస్తున్న కనకదుర్గ ప్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ వంతెన విజయవాడ నగరానికి కొత్త అందాన్ని తెస్తోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ వంతెనను సెప్టెంబర్‌ 4న ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సీఎం జగన్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ఈ ప్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా.. సుదీర్ఘకాలం పాటు పనులు కొనసాగాయి. కేంద్రం సాయంతో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభించారు. అలా సాగుతూ.. ఇటీవలే అన్ని పనులు పూర్తి చేసుకున్న ప్రారంభానికి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో తీసిన కనకదుర్గ ప్లై ఓవర్‌ డ్రోన్‌ వ్యూ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ఓవైపు విజయవాడ.. మరోవైపు కృష్ణానది.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ.. పక్కనే ప్రకాశం బ్యారేజీ.. ఇలా ఆ వీడియో కనువిందు చేస్తోంది. ఈ వీడియోను కేశినేని నాని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం ప్లై ఓవర్‌ అందాలను మీరు చూసేయండి.Next Story
Share it