ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Oct 2020 10:57 AM IST
ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే

తమిళనాడులో ఆ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ విషయం చర్చనీయాంశంగా మారింది. అది కూడా కులాంతర ప్రేమ వివాహం కావడంతో ఆ ఎమ్మెల్యే పేరు ఇప్పుడు అంద‌రి నోళ్ల‌‌ల్లో నానుతుంది. సోమ‌వారం నాడు అన్నాడీఎంకే యువ‌నేత‌, కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఎమ్మెల్యే ఇంట్లో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఎమ్మెల్యే ప్ర‌భు త్యాగదుర్గం మలైకోటై గ్రామానికి చెందిన సౌందర్యతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్‌ రెండో ఏడాది చదువుతున్నారు. ఆమె తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. అయితే.. సౌంద‌ర్య తండ్రి స్వామినాథ‌న్ వీరి పెళ్లిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యే ప్ర‌భు త‌న కూతురుని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న‌ట్లు స్వామినాథ‌న్ ఆరోపించినట్లు వార్తలు వెలువ‌డుతున్నాయి.

అన్నాడీఎంకే పార్టీ నుండి కళ్లకురిచ్చి నియోజ‌క‌వ‌ర్గం త‌రుపున‌ 2016 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ప్రభు. అయితే అధికార పార్టీలో పెళ్లి కాని ఎమ్మెల్యే అంటే టక్కున ప్రభు పేరు చెప్పేవారట. తాజాగా ఈ ఎమ్మెల్యే తన ప్రేమను పెళ్లిగా మలుచుకున్నారు.

Next Story