కదిరి స్కూల్‌ బస్సు ప్రమాదం.. సీఎం జగన్‌ ఆరా.!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 12:43 PM IST
కదిరి స్కూల్‌ బస్సు ప్రమాదం.. సీఎం జగన్‌ ఆరా.!

కర్నాటకలోని ఉడిపి సమీపంలో కదిరికి చెందిన విద్యార్థుల విహారయాత్ర బస్సు అదుపు తప్పి లోయలో పడింది. కాగా ఈ ప్రమాదంపై సీఎం జగన్‌ స్పందించారు. ప్రమాదం జరిగి తీరుపై సీఎం జగన్‌ ఆరా తీశారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు జగన్‌కు తెలిపారు. తక్షణమే సహాయక కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విద్యార్థులను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థి ఫకృద్దీన్‌ మృతి చెందగా, 35 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది టీచర్లు, 39 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులను మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. కదిరి నుంచి విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లారు.

Next Story