కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున రామపూరం మండలం కోండావాండ్లపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఇన్నోవాను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రొద్దుటూరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు రాయచోటికి చెందిన అర్షద్, హజీరాలుగా, చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన హరూన్‌ భాషా, అఫిరాలుగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Kadapa

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.