బంజారాహిల్స్ లో భారీ చోరీ.. ఇంటిదొంగల పనేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 11:16 AM GMT
బంజారాహిల్స్ లో భారీ చోరీ.. ఇంటిదొంగల పనేనా..?

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఇంటిలో భారీ చోరీ జరిగింది. రూ.కోటి రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికొచ్చింది. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివసిస్తున్న వ్యాపారవేత్త కపిల్ గుప్త కుటుంబం నిన్న సాయంత్రం ఒక ఫంక్షన్ కి హాజరై రాత్రి ఇంటికి వచ్చే సరికి ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఇంటి యజమాని మొత్తం తనిఖీ చేసుకోగా అలమారలో ఉన్న కోటి రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే యజమాని కపిల్ గుప్తబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఇంటిలో పని చేసే వ్యక్తిపై కపిల్ కు అనుమానం ఉన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it