ముఖ్యాంశాలు

  • ఆగి ఉన్న ట్రైన్‌ను డీకొన్న మ‌రో ట్రైన్
  • తృటిలో త‌ప్పిన భారీ ప్ర‌మాదం

కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం సంభ‌వించింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్ ను వెనుకనుండి మరో ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విషయం తెలుసుకున్న జీఆర్‌పీ రైల్వే పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. టెక్నికల్ లోపం వల్లే ఆగివున్న ట్రైన్ ను.. వెనుకనుండి మరో ఎంఎంటిఎస్ ట్రైన్ డీ కొట్టింద‌ని తెలిపారు. తృటిలో పెను ప్రమాదం నుండి ప్ర‌యాణికులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాల‌వ‌గా.. గాయప‌డిన వారిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగక‌పోవ‌డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Mmts2

Mmts3

Mmts4

Mmts5

Mmts6

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.