కరోనా సోకి.. ప్రముఖ జర్నలిస్టు కంచిబొట్ల బ్రహ్మానందం మృతి

By అంజి  Published on  8 April 2020 12:24 PM IST
కరోనా సోకి.. ప్రముఖ జర్నలిస్టు కంచిబొట్ల బ్రహ్మానందం మృతి

అమెరికా: న్యూయార్క్‌లో ఉంటున్న తెలుగు వాసి, ప్రముఖ జర్నలిస్టు కంచిబొట్ల బ్రహ్మానందం (65) కరోనా కాటుకు ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా ఏదుబాడు గ్రామానికి చెందిన బ్రహ్మానందం అమెరికాలో విలేఖరిగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. ఐస్‌ల్యాండ్‌లోని ఆస్పత్రిలో బ్రహ్మానందం చికిత్స పొందుతూ మరణించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ పత్రిక విలేఖరిగా బ్రహ్మానందం తన జీవితాన్ని ప్రారంభించారుఎ. కంచిబొట్ల బ్రహ్మానందం సుదీర్ఘకాలంగా అమెరికా వార్తరంగంలో పని చేస్తున్నారు. యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా కరస్పాండెంట్‌గా పని చేస్తూ అక్కడే స్థిర పడ్డారు. గత నెల 23న బ్రహ్మానందంకు ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షిణీంచడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండె పోటు రావడంతో ఆయన మరణించారు. బ్రహ్మానందంకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బ్రహ్మానందం స్వస్థలం ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలోని ఏదుబాడు గ్రామం. ద హిందూ ఆంగ్ల పత్రికలో కూడా ఆయన పనిచేశారు. బ్రహ్మానందం మృతి పట్ల తెలుగు సంఘాలు, జర్నలిస్టు సంఘాలు సంతాప దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

జర్నలిస్టు కంచిబొట్ల బ్రహ్మానందం మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా బ్రహ్మానందం మరణించడం ఎంతో కలచివేసిందని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అంటు కొనియాడారు.

న్యూజెర్సీ, న్యూయార్క్‌ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. గత 24 గంటల్లో న్యూయార్క్‌లో 7312 మంది చనిపోయారు.

Next Story