చైనాకు వార్నింగ్ ఇచ్చేలా భారత్‌ నావిక విన్యాసాలు

By సుభాష్  Published on  20 July 2020 2:22 PM GMT
చైనాకు వార్నింగ్ ఇచ్చేలా భారత్‌ నావిక విన్యాసాలు

గాల్వన్ లోయలో భారత్ -చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం భారత్‌లో స్పష్టమైన మార్పు వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో భారత సైనికుల దూకుడు పెరిగింది. పలు రకాలుగా చైనా దేశానికి షాకుల మీద షాకిస్టోంది భారత్‌. చైనాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రతీకార ధోరణి తెలుస్తోంది. సరిహద్దులో ఘర్షణల అనంతరం చైనాకు ధీటుగా జవాబు ఇస్తోంది. చైనాకు సరైన రీతిలో వార్నింగ్‌ ఇచ్చేలా అమెరికాతో కలిసి అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో నావిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఏడాది చివరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌ మద్దతు కోసం ఎదురు చూస్తోన్న ట్రంప్‌ కూడా భారత్‌తో సంయుక్త నావిక విన్యాసాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో అమెరికాకు చెందిన యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ భారత్‌ జిల్లాల్లోకి ప్రవేశించింది.

అమెరికాకు చెందిన యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ నిమిట్‌జ్‌తో కలిసి భారత యుద్ధ నౌకలు నేవల్‌ ఎక్స్‌ ర్‌సైజ్‌ల‌లో పాల్గొననున్నాయి. వాణిజ్య ప్రయోజనాల కోణంలో అమెరికాను మచ్చిక చేసుకుని తద్వారా భారత్‌ను ఇరుకునపెట్టాలని భావిస్తున్న చైనాకు.. నేవల్‌ ఎక్సర్‌సైజుల ద్వారా భారత్‌ గట్టి షాక్‌ ఇచ్చినట్లవుతుంది. దీంతో భారత్‌, అమెరికా నావిక విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విన్యాసాల ద్వారా తమ సైనిక సామర్థ్యాలను చైనాకు గుర్తు చేసినట్లవుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

జూలై 22న నిర్వహించనున్న ఈ విన్యాసాల కోసం అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ ఇప్పటికే , నికోబార్‌ దీవులకు చేరుకుంది. దాదాపు లక్ష టన్నుల బరువుండే ఈ నౌకకు 90 యుద్ధ విమానాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ విన్యాసాల్లో పాల్గొనడం కోసం మరో యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ కూడా ఇప్పటికే భారత్‌కు బయలుదేరింది.

Next Story