మ‌రో 2,440 ఉద్యోగాల భర్తీకి టీఎస్ స‌ర్కార్‌ అనుమతి

TS Govt Releases Notification for 2440 New Job Vacancies. తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగులకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on  23 July 2022 8:40 AM GMT
మ‌రో 2,440 ఉద్యోగాల భర్తీకి టీఎస్ స‌ర్కార్‌ అనుమతి

తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగులకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 46,988 ఉద్యోగాల భర్తీకి అమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రికొన్ని భ‌ర్తీకి ఆర్థికశాఖ ఓకే చెప్పింది. విద్యాశాఖతో పాటు,స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో మరో 2,440 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 మంది జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేర‌కు టీఆర్ఎస్ పార్టీ అపీషియ‌ల్ కూ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది.

ఇదే విష‌య‌మై ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు కూడా ట్వీట్ చేశారు. తెలంగాణ‌లో ఉద్యోగాల వ‌ర్షం కురుస్తోందంటూ డీటెయిల్స్ షేర్ చేశారు. ఇంటర్ విద్యలో 40 లైబ్రరీయన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, ఆర్కైవ్స్‌ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రరీయన్లు, 5 మాట్రన్‌, 25 ఎలక్ట్రిషీయన్లు, 37 పీడీ పోస్టులు, కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్‌ పోస్టులు, 24 లైబ్రరీయన్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story