తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) గ్రీస్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. హాస్పిటాలిటీ, మెయింటెనెన్స్, సర్వీస్ రంగాలతో సహా వివిధ రంగాలలో 1000 ఖాళీలు ఉన్నాయి. జీతం రూ.92,000 నుండి రూ.1,22,000 వరకు ఉంటుంది. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
ఎంపికైన దరఖాస్తుదారులకు ఉచిత వసతి, ఆహారంతో పాటూ బీమా కూడా లభిస్తుంది. విమాన టికెట్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం కూడా ఉంటుంది. ఉద్యోగులు నెలలో 28 రోజులు, రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. గ్రీస్ చట్టం ప్రకారం 45 నిమిషాల విరామం ఉంటుంది. ఓవర్ టైం చేసిన ఉద్యోగులకు 20 శాతం అదనంగా చెల్లిస్తారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉంటే సరిపోతుంది. గ్రీకు భాష పరిజ్ఞానం అవసరం లేదు. వీసా, ప్రాసెసింగ్ ఖర్చులను అభ్యర్థులు భరించాలి.