తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2022 ఫలితాలు జూలై 1న విడుదల కానున్నాయి. మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశమైన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి.. ఎలాంటి ఆలస్యం చేయకుండా జూలై 1న టెట్ ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. జూన్ 12న టెట్ నిర్వహించబడింది. 3,51,468 మంది నమోదిత అభ్యర్థుల్లో 3,18,506 మంది పరీక్ష పేపర్-1కి హాజరయ్యారు.
అదేవిధంగా, 2,77,900 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 2,51,070 మంది (90.35 శాతం) పేపర్-IIకి హాజరయ్యారు.పేపర్-I అనేది I నుండి V తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థుల కోసం కాగా.. పేపర్-II అనేది VI నుండి VIII తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారి కోసం నిర్వహించబడుతుంది.