1637 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ హైకోర్టు 1637 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోగలరు.

By అంజి  Published on  12 Jan 2025 11:15 AM IST
Telangana, High Court, posts, Jobs,  recruitment

1637 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ హైకోర్టు 1637 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోగలరు. తెలంగాణ హైకోర్టు పరిధిలోని కోర్టులతో పాటు తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌, సబార్డినేట్‌ సర్వీసులలో వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌3, జూనియర్‌ అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబార్డినేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://tshc.gov.in/ను చూడండి.

Next Story