ఈనెల 15 నుంచి ఆర్‌ఆర్‌బీ పరీక్షలు
RRB Exams From December 15th. రైల్వే శాఖలో కొలువుల జాతర మొదలైంది. ఈనెల 15 నుంచి ఎన్టీపీసీ, ఐసోలేటెడ్ అండ్
By Medi Samrat Published on 13 Dec 2020 9:15 AM ISTరైల్వే శాఖలో కొలువుల జాతర మొదలైంది. ఈనెల 15 నుంచి ఎన్టీపీసీ, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్‌ఆర్‌బీ గతేడాది విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1.4 లక్షల పోస్టులకు సంబంధించి మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ఆర్‌ఆర్‌బీ నిర్వహించనున్నది. మొత్తం మూడు దశల్లో ఈ నియామక ప్రక్రియ ఉండనుంది.
మొదటి దశలో ఐసొలేడెట్ అండ్ మినిస్టీరియల్ క్యాటగిరీ ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. రెండో దశలో నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ (ఎన్టీపీసీ) పరీక్ష ఈ నెల 28 నుంచి మార్చి 2021 వరకు జరుపుతారు. మూడో దశలో లెవల్–1 సీబీటీ పోస్టులకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది.
ఇదిలావుంటే.. సికింద్రాబాద్ జోన్‌కు సంబంధించి మొదటి దశలో(ఐసొలేడెట్ అండ్ మినిస్టీరియల్ క్యాటగిరీ) 95 పోస్టుల భర్తీకి 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 6,138 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలో 3,234 ఖాళీలను భర్తీ చేయనుండగా 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 2.44 కోట్ల మంది పాల్గొంటారని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది.