తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

Notifications for Govt jobs in Telangana. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

By Medi Samrat  Published on  30 Dec 2022 1:12 PM GMT
తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టీఎస్‭పీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఆన్‭లైన్‭లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన టీఎస్ పీఎస్సీ స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక గ్రూప్ 2లో 768 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి గ్రూప్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

స్టాఫ్ నర్స్ పోస్టులకు తెలంగాణ మెడికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5వేల 204 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. డీఎంఈ, డీహెచ్ ప‌రిధిలో 3,823 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వైద్య విధాన ప‌రిష‌త్‌లో 757 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్యర్థులు జ‌న‌వ‌రి 25 నుంచి ఫిబ్రవ‌రి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. మొత్తం 7వేల 320 పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టగా.. ఇప్పటికే 969మందిని తీసుకున్నామని తెలిపారు. కొత్తగా 5వేల 204 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలోనే స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని ట్వీట్ లో తెలిపారు.


Next Story