ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖాజా మాన్షన్, మాసబ్ ట్యాంక్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 40కి పైగా కంపెనీలు మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాయి. ఫ్రెషర్లు మరియు అనుభవం ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హత ప్రకారం తగిన ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.
ఆసక్తి గల అభ్యర్థులు తమ రెండు సెట్ల ధ్రువపత్రాలు, బయోడేటా, ఉపాధి కోరుకునే దరఖాస్తు, ఫోటోగ్రాఫ్‌లతో జాబ్ మేళాకు హాజరవాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇదిలావుంటే.. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) శుక్రవారం ఆన్‌లైన్ మోడ్‌లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉర్దూ జాబ్ మేళాను ప్రారంభించింది. దేశం నలుమూలల నుండి 2,500 మందికి పైగా అభ్యర్థులు జాబ్ మేళా కోసం నమోదు చేసుకున్నారు. ఈ నెలలో 50కి పైగా కంపెనీలు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేయనున్నారు.