జాబ్ సెర్చ్, బిజినెస్-ఫోకస్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ 700 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించుకుంది. సేల్స్, ఆపరేషన్, సపోర్ట్ యూనిట్ల నుండి 716 మంది సిబ్బందిని తొలగించాలని లింక్డ్‌ఇన్ యాజమాన్యం యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ ఇన్ ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తీసేసేందుకు లింక్డ్ఇన్ యాజమాన్యం సిద్ధమైంది.
చైనాలో నడుస్తున్న జాబ్ సెర్చ్ యాప్ ‘ఇన్ కెరియర్స్’ను కూడా దశలవారీగా ఆగస్టు 9 కల్లా మూసేయనున్నట్లు ప్రకటించింది. లింక్డ్ ఇన్ లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతేడాదిలో ప్రతి త్రైమాసికంలో ఆదాయం పెరిగినప్పటికీ ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా అమ్మకాలు, కార్యకలాపాలు, సహాయక బృందాల్లో స్టాఫ్ ను తగ్గించాలని భావిస్తున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో లింక్డ్ ఇన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. జాబ్ సెర్చ్ కమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వెండర్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నామని.. అభివృద్ధి చెందుతున్న, వృద్ధి చెందుతున్న మార్కెట్ల సెగ్మెంట్‌ను అందించాలని భావిస్తున్నట్లు ర్యాన్ రోస్లాన్స్కీ తెలిపారు.