నిరుద్యోగులకు ఎల్ఐసీ శుభవార్త.. 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ విడుదల
LIC ADO recruitment 2023 for 9394 vacancies across India.నిరుద్యోగులకు ఎల్ఐసీ శుభవార్త చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2023 7:35 AM GMTనిరుద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన 9,394 అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ADO) ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు భర్తీ ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ జోన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..?
సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్) 561, ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా) 1049, ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా) 669, నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢిల్లీ) 1216, నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) 1033, సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై) 1516, సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) 1408, వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి) 1942 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2023 జనవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. మార్చి 12న ప్రిలిమినరీ రాత పరీక్ష, ఏప్రిల్ 8న మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.51,500ల నుంచి రూ.90,205ల వరకు జీతంగా చెల్లించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.licindia.inని సందర్శించొచ్చు.