తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..

డిగ్రీలో మార్కులు తక్కువ ఉండటం కారణంగా డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త​ చెప్పింది.

By అంజి  Published on  14 Jun 2024 7:03 AM IST
Telangana Govt, DSC exam , degree marks, Telangana

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. 

హైదరాబాద్‌: డిగ్రీలో మార్కులు తక్కువ ఉండటం కారణంగా డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త​ చెప్పింది. 2011కు ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే డీఎస్సీ రాయాలంటే డిగ్రీల్లో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధన ఉండేది.

కాగా భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నంబర్ 14ను రిలీజ్ చేశారు. ఎన్​సీటీఈ నిబంధనల ప్రకారం.. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. ఈనెల 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

Next Story