650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,200 మంది నర్సులను నియమిస్తాం

650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1200 మంది నర్సుల నియామకానికి కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు

By Medi Samrat  Published on  7 Aug 2024 9:45 PM IST
650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,200 మంది నర్సులను నియమిస్తాం

650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1200 మంది నర్సుల నియామకానికి కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పోస్టులను కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

పాటిల్‌ సంబంధిత అధికారులతో సమావేశమై 22 మెడికల్‌ కాలేజీలు, 11 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 33 ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఖాళీ పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు కేఈఏకు మార్గం సుగమం చేసేందుకు డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ బైలాస్‌ను సవరిస్తామని మంత్రి తెలిపారు.

Next Story