కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల గిరిజన నిరుద్యోగ యువత కోసం ఆగస్టు 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ (INTEGRATED TRIBAL DEVELOPMENT AGENCY) ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్, అపోలో ఫార్మసీ, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, పేటీఎం, వరుణ్ మోటార్స్, జీఎంఆర్ కార్గో, ఎల్ఐసీ ఇండియా, గ్లాండ్ ఫార్మా, స్విగ్గీ తదితర 20 కంపెనీలు జాబ్ మేళాలో భాగం కానున్నాయని తెలిపారు.
ఆసక్తిగల గిరిజన యువత తమ రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, సర్టిఫికెట్ల ఫొటో కాపీలతో ఉదయం 9:30 గంటలకు భద్రాచలం ఐటీడీఏలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని రాహుల్ కోరారు. మరింత సమాచారం కోసం 81438 40906, 63026 08905 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.