గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌ : అభ్యర్థులు 2 గంటల ముందుగానే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి

Group-I candidates should reach centre 2 hours prior to exam. అక్టోబర్ 16న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి

By Medi Samrat  Published on  12 Oct 2022 9:35 AM GMT
గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌ : అభ్యర్థులు 2 గంటల ముందుగానే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి

అక్టోబర్ 16న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందుగా అంటే ఉదయం 8.30 గంటలకే ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద‌కు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న‌ప్పటికీ.. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుండి సెంటర్‌లలోకి అనుమతిస్తారు. 10.15 గంటల వ‌ర‌కు అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమ‌తిస్తారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఎగ్జామ్ సెంట‌ర్ల వ‌ద్ద‌ అభ్యర్థుల బయోమెట్రిక్, ఇత‌ర వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ ఉండ‌టం చేత అభ్యర్థులను ముందుగానే హాల్‌లోకి అనుమ‌తించ‌నున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) తొలిసారిగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రిలిమినరీ పరీక్ష సమయంలో సేక‌రించిన‌ వివరాలు అభ్యర్థి యొక్క ధృవపత్రాలను ధృవీకరించడానికి మెయిన్ పరీక్ష సమయంలో ధృవీకరించబడతాయి. ఏదైనా త‌ప్పు జ‌రిగిన‌ట్లు నివేదించబడినట్లయితే.. కమిషన్ క్రిమినల్ కేసులను నమోదు చేయడం.. భవిష్యత్తులో జరిగే రిక్రూట్‌మెంట్ పరీక్షల నుండి డిబార్ చేయడం వంటి తీవ్రమైన చర్యలను తీసుకునే విధంగా ప‌క‌డ్భందీగా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలను, సమాన సంఖ్యలో చీఫ్ సూపరింటెండెంట్‌లను ఏర్పాటు చేసింది కమీషన్. పరీక్ష ముగిసిన త‌ర్వాత‌.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో OMR షీట్‌ స్కాన్ కాపీలతో పాటు కీ ని విడుదల చేస్తుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి తెలిపారు. రిక్రూట్‌మెంట్ పరీక్షలపై ఎలాంటి పుకార్లు, బ్రోకర్లను నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నిరాధారమైన పుకార్లను ఉక్కు పిడికిలితో వ్యవహరిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


Next Story