నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు

Good News To Unemployment. నిరుద్యోగుల‌కు ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా) శుభ‌వార్త చెప్పింది.

By Medi Samrat  Published on  15 Nov 2020 12:47 PM GMT
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు

నిరుద్యోగుల‌కు ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా) శుభ‌వార్త చెప్పింది. దేశంలో క‌రోనా ప‌రిస్థితులు నెమ్మ‌దిస్తుండ‌డంతో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియలు ఊపందుకున్నాయి. తాజాగా ఎస్‌బీఐ జాబ్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ప్రొబెష‌న‌రీ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో జనరల్ కేటగిరీలో 810, ఓబీసీలకు 540, ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 200 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 21 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్ల‌ను చూడొచ్చు.

ప్రిలిమ్స్ పరీక్షలు డిసెంబరు 31 నుంచి 2021 జనవరి 5 వరకు జరుగుతాయి. జనవరి మూడో వారంలో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత జనవరి 29న మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి చివరి వారంలో మెయిన్స్ ఫలితాలు వస్తాయి. అదే నెలలో కానీ , మార్చి నెలలో కానీ ఇంటర్వ్యూలు చేపడతారు.


Next Story