Jobs : లక్షల రూపాయలకు పైగా జీతం.. ఈ అర్హతలు ఉన్నాయా.?

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU).. ప్రస్తుతం జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ (గ్రేడ్ 1, 2, 3) రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది

By Medi Samrat  Published on  21 Sep 2024 4:45 AM GMT
Jobs : లక్షల రూపాయలకు పైగా జీతం.. ఈ అర్హతలు ఉన్నాయా.?

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU).. ప్రస్తుతం జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ (గ్రేడ్ 1, 2, 3) రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 25 లోపు అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ recruitment.eil.co.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు, సంబంధిత అనుభవం, గరిష్ట వయోపరిమితి లాంటి వివరాలను గమనించండి. విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ CGPA/OGPA/CPI లేదా లెటర్ గ్రేడ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తుంటే అందుకు సంబంధిత శాతాన్ని తప్పనిసరిగా అభ్యర్థులు కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ సమయంలో, అభ్యర్థులు తమ యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి వెరిఫికేషన్ కోసం అధికారిక డాక్యుమెంటేషన్ లేదా సర్టిఫికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 31, 2024 నాటికి అన్ని స్థానాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. ఢిల్లీలో నిర్వహించే స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. EIL అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేయవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

ఖాళీల వివరాలు

Jr డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-III:

అర్హత: 2 సంవత్సరాల ITI డ్రాఫ్ట్స్‌మన్‌షిప్ కోర్సు అవసరం.

మొత్తం ఖాళీలు: 11 (UR-5, SC-2, ST-1, OBC(NCL)-2, EWS-1).

పే స్కేల్: రూ. 24,000 - రూ. 90,000.

జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ II:

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా అవసరం.

మొత్తం ఖాళీలు: 6 (UR-2, SC-1, ST-1, OBC(NCL)-1, EWS-1).

పే స్కేల్: రూ. 25,000 - రూ. 1,00,000.

జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-I:

అర్హత: కనీసం 65% మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా అవసరం.

పే స్కేల్: రూ. 26,500 - రూ. 1,15,000.

అనుభవం:

గ్రేడ్-I: 5 సంవత్సరాలు

గ్రేడ్-II: 1 సంవత్సరం

గ్రేడ్-III: 2 సంవత్సరాలు

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ recruitment.eil.co.in. ని సందర్శించండి. అవసరమైన వివరాలతో ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. ఫోటోగ్రాఫ్‌లు, సంతకాలు, సర్టిఫికేట్‌లతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Next Story