ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది

By Medi Samrat  Published on  3 July 2024 12:45 PM GMT
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ విన్నపాలపై APPSC తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జులై 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువజన జేఏసీ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, మరికొందరు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటూ పరీక్షలకు సిద్ధం కాలేకపోయారని తెలిపారు.

Next Story