నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. టీచర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

AP govt. to recruit 502 teacher posts under DSC Limited Recruitment 2022. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 502 టీచర్ పోస్టులతో

By Medi Samrat
Published on : 23 Aug 2022 6:18 PM IST

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. టీచర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 502 పోస్టుల్లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో 199, మోడల్‌ పాఠశాలల్లో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్ పాఠశాలల్లో 15 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 81 ఉన్నాయి.

కాగా, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఫీజు చెల్లింపు ఈరోజు ప్రారంభమై సెప్టెంబర్ 27 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 23న పరీక్ష నిర్వహించి.. నవంబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.


Next Story