16,347 ఉద్యోగాలు.. బిగ్‌ అప్డేట్‌ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే దరఖాస్తుల స్వీకరణ పూర్తైంది.

By అంజి
Published on : 17 May 2025 9:15 AM IST

AP government, Mega DSC, APnews, Teacher jobs

16,347 ఉద్యోగాలు.. బిగ్‌ అప్డేట్‌ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే దరఖాస్తుల స్వీకరణ పూర్తైంది. మొత్తం 3.35 లక్షల మంది అభ్యర్థులు అభ్యర్థులు అన్ని పోస్టులకు 5.77 లక్షల దరఖాస్తులు చేశారు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 73,605 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా కడప జిల్లా నుంచి 15,812 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 7,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వం మోడల్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 30వ తేదీన హాల్‌ టికెట్లు జారీ చేయనుంది. హాల్‌ టికెట్ల జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయి.

మాక్‌ టెస్ట్‌లు: మే 20 నుంచి అందుబాటులోకి వస్తాయి.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: మే 30 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు: జూన్‌ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించనున్నారు.

ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల

అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ

ఫైనల్‌ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్‌ కీ విడుదల

మెరిట్‌ జాబితా: ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఫలితాలు విడుదల

Next Story