అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

Agniveer notification 2022 released. అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఇండియన్‌ ఆర్మీలో 'అగ్నివీర్‌' నియామకాలకు

By Medi Samrat  Published on  20 Jun 2022 3:57 PM IST
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఇండియన్‌ ఆర్మీలో 'అగ్నివీర్‌' నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో కూడా అగ్నివీర్‌ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్మీ తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది.

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం పూర్తి షెడ్యూల్ పూర్తి వివరాలను ప్రకటించింది. భారత సైన్యంలో రిజిస్ట్రేషన్లు జూన్ 20, 2022 నుండి ప్రారంభం అవ్వగా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రిజిస్ట్రేషన్లకు జూన్ 24, 2022.. ఇండియన్ నేవీ రిజిస్ట్రేషన్లకు జూన్ 21, 2022 నుండి ప్రారంభం అవుతుంది. అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద అగ్నివీర్‌ల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచే ప్రారంభించిన‌ట్టైంది. కేంద్రం అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగ యువతలో ఉన్న అపోహలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.









Next Story