ఉద్యోగులకు షాకిచ్చిన Accenture

భారతదేశంలోని ప్రముఖ IT దిగ్గజ సంస్థల్లో ఒకటైన Accenture సంస్థ.. 2023లో భారతదేశం, శ్రీలంకలోని తమ ఉద్యోగులకు జీతాల

By Medi Samrat  Published on  12 Oct 2023 12:26 PM GMT
ఉద్యోగులకు షాకిచ్చిన Accenture

భారతదేశంలోని ప్రముఖ IT దిగ్గజ సంస్థల్లో ఒకటైన Accenture సంస్థ.. 2023లో భారతదేశం, శ్రీలంకలోని తమ ఉద్యోగులకు జీతాల పెరుగుదల ఉండదని ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. ఈ నిర్ణయాన్ని యాక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు తెలియజేశారు. దేశంలోని అన్ని విభాగాలకు ఇది వర్తించదని తెలుస్తోంది. భారత్‌లోని తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపు, బోనస్ చెల్లింపులు ఉండవని తెలిపింది. కీలక నైపుణ్యాలతో కూడిన విభాగాలకు ఇది వర్తించదని తెలిపింది. యాక్సెంచర్ వృద్ధి అంచనాలకు అనుగుణంగా లేకపోవడం నిరాశకు గురి చేసింది.

ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో యాక్సెంచర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. 2023 మార్చిలో 19000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నైపుణ్యాలు, పని ప్ర‌దేశం ఆధారంగా వేత‌నం అందించేలా యాక్సెంచ‌ర్ వేత‌న చెల్లింపులు ఉంటాయ‌ని తెలిపింది. ఈ ఏడాది ఉద్యోగుల‌కు వేత‌న పెంపును కంపెనీ చేప‌ట్ట‌డం లేద‌ని ఉద్యోగుల‌కు పంపిన ఈ మెయిల్‌లో కంపెనీ ఎండీ అజ‌య్ విజ్ తెలిపారు. పదోన్నతులను 2024 జూన్ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం, యాక్సెంచర్‌కు భారతదేశంలో 300,000 మంది నిపుణులు ఉన్నారు.

Next Story