సింగరేణి : రాత పరీక్షకు హాజరైన 77,907 మంది

77,907 candidates appear for SCCL written test. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల

By Medi Samrat  Published on  4 Sep 2022 3:15 PM GMT
సింగరేణి : రాత పరీక్షకు హాజరైన 77,907 మంది

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 77,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న మొత్తం 90,928 మంది అభ్యర్థుల్లో 77,906 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై 79 శాతం హాజరు నమోదు చేసినట్లు ఎస్‌సిసిఎల్ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 89 శాతం హాజరు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 64 శాతం హాజరు నమోదైందన్నారు. వ్రాత పరీక్షకు సంబంధించిన కీ ని సోమవారం విడుదల చేస్తామని, దానిని SCCL వెబ్‌సైట్: https://scclmines.com/లో అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు రిఫరెన్స్ బుక్స్, సోర్స్ వివరాలతో పాటు ఆధారాలతో వెబ్‌సైట్ ద్వారా ఫార్వార్డ్ చేయవచ్చని తెలిపారు.

Next Story