Telangana: రెవెన్యూ శాఖలో 5 వేల పోస్టులు!
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రెవెన్యూ శాఖలో 5 వేల పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
By అంజి Published on 10 Oct 2024 7:33 AM IST
Telangana: రెవెన్యూ శాఖలో 5 వేల పోస్టులు!
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రెవెన్యూ శాఖలో 5 వేల పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిలో సగం గ్రామాలకు రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే 5 వేల మందికి కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇంకో సగం పోస్టులకు ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయనున్నారు. ఈ పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్లను పరిశీలిస్తోంది. కొత్త ఉద్యోగుల ద్వారా గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థపై నిర్వహంచిన సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి వారికి కుల, ఆదాయ సర్టిఫికెట్లతో పాటు భూములు రికార్డులు, వృక్షాల పరిరక్షణ, భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు వంటి బాధ్యతలు అప్పగించనున్నారు. రెవెన్యూ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగిన వారిని తీసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకురానున్నారు. అందులో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లను ఎలా నియమించేది వెల్లడించనున్నారు.