గుడ్‌న్యూస్ : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్

49 vacancies at Ministry of Home Affairs. అండర్‌ సెక్రటరీ, మేనేజర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, ప్రైవేట్‌ సెక్రటరీ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌

By Medi Samrat
Published on : 25 May 2022 5:32 PM IST

గుడ్‌న్యూస్ : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్

అండర్‌ సెక్రటరీ, మేనేజర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, ప్రైవేట్‌ సెక్రటరీ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ వంటి వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు జూన్ 24, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటీసు ప్రకారం డిపార్ట్‌మెంట్ న్యూ ఢిల్లీలోని ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (LPAI) సెక్రటేరియట్‌లో గ్రూప్ 'A', 'B', 'C' పోస్ట్‌ల కోసం వివిధ ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల (ICPs)లో విధులు నిర్వర్తించే వారి కోసం వెతుకుతోంది. భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దుల్లోని స్థానాలు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీస్) ప్రాతిపదికన ప్రతిపాదిస్తుంది.

దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ నుండి వారి అర్హతను చూసుకోవచ్చు. వివిధ ఉద్యోగాలకు ఇచ్చే పే బ్యాండ్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.

ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ లో చూడండి:

https://www.mha.gov.in/sites/default/files/VacanciesGroupABC_12052022.PDF














Next Story