తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 25-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉటుంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి.
హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి పర్యవేక్షణలో ఈ నియామకాలు జరుగుతాయి. డ్రైవర్ ఉద్యోగాలకు జీతం నెలకు రూ.29,960 నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అదే సమయంలో శ్రామిక్ పోస్టులకు నెలకు జీతం రూ.16,550 నుంచి రూ.45,030 వరకు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు https://www.tgprb.in/ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.