కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వాహనాల అక్రమ రిజిస్టేషన్ల కేసులో కడప కేంద్ర కారాగారంలో ఉన్న వారిద్దని పోలీసులు విచారించనున్నారు. దీని కోసం అనంతపురం నుంచి 8 మంది పోలీసులు వచ్చారు.

రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అనంతపురం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇద్దరినీ పోలీసులు విచారించనున్నారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఆర్టీఏ అధికారులు వారిపై అభియోగాలు మోపిన నేపథ్యంలో కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

తోట‌ వంశీ కుమార్‌

Next Story